ఉయ్యూరులో విషాదం: బైక్‌పై విన్యాసాలు చేస్తూ గాయపడిన సాయికృష్ణ మృతి

Published : Nov 22, 2022, 01:21 PM IST
ఉయ్యూరులో  విషాదం:  బైక్‌పై  విన్యాసాలు చేస్తూ గాయపడిన  సాయికృష్ణ  మృతి

సారాంశం

బైక్  పై  విన్యాసాలు  చేస్తూ  గాయపడిన  యువకుడు  గౌరీ సాయికృష్ణ  మృతి  చెందాడు.  సాయికృష్ణ  మృతితో  పేరేంట్స్  కన్నీరు  మున్నీరుగా   విలపిస్తున్నారు.   

అమరావతి:బైక్ పై  విన్యాసాలు  చేస్తూ  రోడ్డుపై  పడిన  యువకుడు  తీవ్రంగా  గాయపడ్డాడు. ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  ఆ  యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు.ఉమ్మడి  కృష్ణా  జిల్లాకు  చెందిన  గౌరీ సాయికృష్ణ  అనే  యువకుడు  బైక్  స్టంట్‌లు  చేస్తూ  ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో  సాయికృష్ణ  తీవ్రంగా  గాయపడ్డాడు. ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  మృతి చెందాడు. 15 రోజుల పాటు  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  సాయికృష్ణ  చనిపోయాడు.

బైక్  మెకానిక్  దుకాణంలో  సాయికృష్ణ  పనిచేస్తున్నాడు. ఎనిమిదో  తరగతి  వరకు  చదువుకున్న సాయికృష్ణ   మెకానిక్  పనులు చేస్తున్నాడు. స్నేహితులతో  కలిసి  సాయికృష్ణ  బైక్ పై స్టంట్ లు  నిర్వహిస్తున్నారు.హైద్రాబాద్  తరహలో  నిర్వహించినట్టుగా ఉయ్యూరులో  బైక్  స్టంట్ లు  నిర్వహిస్తున్నారు.  ఈ  తరహ బైక్ విన్యాసాలను  నిర్వహించకుండా  ఆపడంలో  పోలీసులు  వైఫల్యం చెందారనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపైనే  బైక్  పై  విన్యాసాలు  చేయడంతో  స్థానికులు  భయబ్రాంతులౌతున్నారు. 

జనసంచారం  తక్కువగా  ఉన్న  రోడ్లపై  ఎక్కువగా  బైక్  విన్యాసాలు చేస్తున్నారు.  విజయవాడ  చుట్టు పక్కల  ఉన్న  రోడ్లపై  బైక్  విన్యాసాలు చేస్తున్నారు  యువకులు,  ఉయ్యూరు  పట్టణానికి సమీపంలోని  రోడ్డుపై  ఇటీవల  కాలంలో  బైక్  విన్యాసాలు  చేస్తున్నట్టుగా  స్థానికులు  చెబుతున్నారు.  

 


 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?