ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసు : సినిమా డైరెక్టర్ తో సహా ఆరుగురి అరెస్ట్

By AN TeluguFirst Published Oct 8, 2020, 1:03 PM IST
Highlights

ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల వ్యవహారంలో పోలీసులు ఓ సినిమా డైరెక్టర్ సహా ఆరుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.  గత నెలలో మంగళూరులోని మూడ్‌బిద్రే బ్యాంకులో నకిలీ చెక్కులు సమర్పించి రూ.52.65 కోట్లు కొట్టేసేందుకు ఉదయ్ కుమార్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ప్రయత్నించారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తతతో ఆ చెక్కులు క్లియరెన్స్‌కు వెళ్లలేదు. 

అరెస్టైన వారిలో కోస్టల్‌వుడ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శెట్టి ఉన్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో వీరిని అరెస్ట్ చేసిన కర్నాటక పోలీసులు.. ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఏపీ సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన కుట్ర.. సెప్టెంబరు 20న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ చెక్కులతో ఏకంగా రూ.112 కోట్లను కాజేయాలని స్కెచ్ వేశారు. ఐతే బ్యాంక్ అధికారుల అప్రమత్తతతో ఈ కుట్ర బయటపడింది. 

నకిలీ CMRF చెక్కులు తయారు చేసిన కేటుగాళ్లు.. ఢిల్లీ, మంగళూరు, కోల్‌కతా బ్యాంకుల ద్వారా నగదును ఉపసంహరించాలని ప్రయత్నించారు. మంగళూరులోని మూడ్‌బిద్రే శాఖలో రూ.52.65 కోట్లు, ఢిల్లీలోని సీసీపీసీఐ శాఖలో రూ.39.85 కోట్లు, కోల్‌కతాలోని మోగ్ రాహత్ శాఖలో రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం సమర్పించారు.
 
అంత భారీ మొత్తంలో డబ్బుల విత్‌డ్రా చేయడం, పైగా ఆ ఖాతా సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించినది కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. నకిలీ కుట్ర మొత్తం బయటపడింది.

ఈ వ్యవహారాన్ని ఏపీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబరు 21 తేదీన తుళ్లూరులో కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఏసీబీలోని.. అర్బన్ కరెప్షన్ డిటెక్టివ్ ఫోర్సు నిందితులను గుర్తించారు. 

అనంతరం దక్షిణ కన్నడ జిల్లా పోలీసులను అలెర్ట్ చేయడంతో..బుధవారం మంగళూరులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఢిల్లీ, కోల్‌కతాలో నకిలీ చెక్కులను సమర్పించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారి కోసం కూడా ఏపీ పోలీసులు, ఏసీబీ గాలిస్తోంది.

click me!