
అనంతపురం: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బొలేరో మినీ లారీ బోల్తా కొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది.
మినీ లారీలో అనంతపురంలోని ఓ వివాహానికి హాజరు కావడానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.