జనసేనాని పవన్ కళ్యాణ్ కంటికి ఆపరేషన్

By narsimha lodeFirst Published 23, Aug 2018, 7:03 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కంటికి గురువారం నాడు ఆపరేషన్  జరిగింది. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ కంటి సమస్యతో బాధపడుతున్నారు.

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కంటికి గురువారం నాడు ఆపరేషన్  జరిగింది. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ కంటి సమస్యతో బాధపడుతున్నారు.

గతంలో ఒక్కసారి పవన్ కళ్యాణ్‌కు కంటి ఆపరేషన్ జరిగింది. గురువారం నాడు మరోసారి పవన్ కళ్యాణ్‌ కంటికి ఆపరేషన్ జరిగింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కారణంగా గతంలో ఆపరేషన్ చేయించుకొన్నాడు. కానీ, ఏపీలో  విస్తృతంగా పర్యటించారు.

కంటి విశ్రాంతి లేకపోవడంతో మరోసారి కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థఇతులు నెలకొన్నాయని  వైద్యులు చెబుతున్నారు. సోదరుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు  చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గురువారం నాడు హైద్రాబాద్‌లో కంటి ఆపరేషన్ చేయించుకొన్నారు. కొద్ది రోజుల పాటు ఆయనకు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.

ఈ వార్త చదవండి

రాజా ఆశోక్‌బాబు చూపు : పవన్‌ వైపా, జగన్ వైపా

 

Last Updated 9, Sep 2018, 11:07 AM IST