తిరుపతిలో ఒకే పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థుల ఆదృశ్యం

sivanagaprasad kodati |  
Published : Oct 12, 2018, 12:56 PM IST
తిరుపతిలో ఒకే పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థుల ఆదృశ్యం

సారాంశం

తిరుపతిలో ఆరుగురు విద్యార్థుల ఆదృశ్యం కలకలం రేపుతోంది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూలులో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నిన్నటి నుంచి జాడ లేకుండా పోయారు. 

తిరుపతిలో ఆరుగురు విద్యార్థుల ఆదృశ్యం కలకలం రేపుతోంది. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూలులో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నిన్నటి నుంచి జాడ లేకుండా పోయారు. గురువారం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో ప్రిన్సిపాల్ వీరిని మందలించి.. తల్లిదండ్రులను తీసుకుని రావాల్సిందిగా ఇంటికి పంపించేశారు.

ఇంట్లో తిడతారేమోనని భయపడిన బాలురు ఇంటికి వెళ్లకుండా ఒక థియేటర్‌కు సినిమాకు వెళ్లినట్లుగా తోటి విద్యార్థులు చెబుతున్నారు. సినిమా అయిపోయిన తర్వాత వారు తిరిగి ఇళ్లకు వెళ్లలేదు.. రెండు రోజులు గడుస్తున్నా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

స్కూలు యాజమాన్యం వేధింపుల వల్లే పిల్లు కనిపించకుండా పోయారంటూ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్