నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

By sivanagaprasad kodatiFirst Published Oct 12, 2018, 11:05 AM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై ఏపీ మంత్రి నారాలోకేశ్ స్పందించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై నిలదీసినందుకే ప్రధాని ఆంధ్రప్రదేశ్‌పై కక్ష గట్టారని లోకేశ్ ఆరోపించారు

టీడీపీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై ఏపీ మంత్రి నారాలోకేశ్ స్పందించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలపై నిలదీసినందుకే ప్రధాని ఆంధ్రప్రదేశ్‌పై కక్ష గట్టారని లోకేశ్ ఆరోపించారు.

కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నందుకే సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిపించారని అన్నారు.. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసి 100 రోజులు గడుస్తున్నా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదని.. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్, కడపలలోని ఎంపీ సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎంపీ ఢిల్లీలో ఉన్నారు.

ప్రధాని మా అంతు చూస్తా అన్నారు...ముల్లుని ముల్లుతోనే తీస్తాం: సీఎం రమేశ్

దాడులు ఎందుకు..? పీఏసీ మెంబర్‌ హోదాలో అడిగిన రమేశ్.. మూడు రోజుల్లోనే ఐటీ రైడ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు
 

click me!