వైసీపీలో ఊపందుకున్న అన్న పిలుపు: ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు

By Nagaraju TFirst Published Jan 31, 2019, 11:21 AM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తాజాగా అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ జగన్ ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాశారు. ముందుగా సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు రాశారు. 
 

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తటస్థులను ఆకర్షించేందుకు అన్న పిలుపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తటస్థులకు లేఖలు సైతం రాశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తాజాగా అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ జగన్ ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాశారు. ముందుగా సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు రాశారు. 

ఈ నెల 15న లేఖ రాసినట్లు తెలుస్తోంది. లేఖపై పార్టీ గుర్తు ఫ్యాన్‌, జగన్‌ ఫొటోను ముద్రించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు ఆఖరున ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.  విధి నిర్వహణల మీరు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మిమ్మల్ని కలిసి ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు. 

తనకు తాను పరిచయం చేసకుంటూ ఊద్యోగుల సేవలను ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత ఏపీకి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారు. 

368 రోజులు నేను చేసిన పాదయాత్రలో మీ గుండెచప్పుడు విని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. పాదయాత్రలో భాగంగా మీలాంటి ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలుసుకోవడం నా అదృష్టం. 

click me!