మావోయిస్టు అగ్రనేత అర్ కే మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన భార్య శిరీష చెప్పారు. వైద్యం అంది ఉంటే ఆర్‌కే బతికి ఉండేవాడని విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణ రావు చెప్పారు.
గుంటూరు: ఆర్‌కె మరణించినా కూడా ఆయన ఆశయాలను ప్రజలు ముందుకు తీసుకెళ్తారని మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్‌కె భార్య Sirisha చెప్పారు.Rama Krishna మరణించిన విషయాన్ని Maoist పార్టీ ధృవీకరించిన తర్వాత శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆర్‌కె అనారోగ్యంతో మరణించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
also read:అగ్రనేత రామకృష్ణ(ఆర్‌కె) మృతి: ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
ప్రభుత్వమే ఆర్‌కెను హత్య చేసిందని ఆమె ఆరోపించారు. ఇప్పుడే మావోయిస్టు పార్టీ లేఖను మీడియాలో చూశానని ఆమె తెలిపారు. ప్రజల కోసం ప్రజల మధ్యే పనిచేసిన ఆర్‌కె కు అదే ప్రజల మధ్య అంత్యక్రియలు నిర్వహించారన్నారు. పార్టీలో సుధీర్ఘ కాలం పనిచేసిన నేతల భౌతిక కాయాలు బయటకు పంపడం కూడా పార్టీకి సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
అడవి చుట్టూ పోలీసులను మోహరించడంతో రామకృష్ణకు వైద్యం అందకుండా చేశారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వమే రామకృష్ణను హత్య చేయించిందన్నారు.క్యాడర్‌తో కలిసి పనిచేసే అగ్రనేత పార్టీలో అత్యంత అరుదుగా ఉంటారని శిరీష చెప్పారు.రామకృష్ణకు సంబంధించి ఆరోగ్య పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదని శిరీష తెలిపారు.
ఆర్‌కె మరణం మావోయిస్టు పార్టీతో పాటు ప్రజలకు తీరని లోటని ఆమె అభిప్రాయపడ్డారు.ఉన్నతమైన సమాజం కోసం ఆయన తన జీవితాంతం విప్లవోద్యమంలోనే పనిచేశాడని ఆమె గుర్తు చేశారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసేవాడని ఆమె చెప్పారు. ఒక్కరు చనిపోతే వారి బాటలో వేలాది మంది వారి బాటలోనే నడుస్తారన్నారు. మావోయిస్టులను అణచివేస్తున్న మోడీ సర్కార్ కుప్పకూలిపోతోందని ఆమె హెచ్చరించారు. జన జీవన స్రవంతిలో కలిసిన తన లాంటి వాళ్లను కూడ ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఆర్‌కే ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు: కళ్యాణ్ రావు
మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్‌కె భౌతికంగా లేకపోయినా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు చెప్పారు. ఏ ప్రజలను ప్రేమించాడో ఆ ప్రజలతోనే జీవించాడు... ఆ ప్రజల మధ్యనే ఆయన అమరుడయ్యాడన్నారు. విప్లవకారుడిగానే ఆయన జీవితాన్ని ముగించారన్నారు. వైద్యం అంది ఉంటే రామకృష్ణ బతికి ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు.