తిరుమల శ్రీవారి సన్నిధిలో సింగర్‌ సునీత..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 31, 2020, 02:51 PM IST
తిరుమల శ్రీవారి సన్నిధిలో సింగర్‌ సునీత..

సారాంశం

ప్రముఖ సింగర్‌ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. 

ప్రముఖ సింగర్‌ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందటానికి వచ్చానన్నారు. లాక్ డౌన్‌లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 

కాగా, వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. 
గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో‌  డిసెంబర్‌ 20 ఆదివారం రాత్రి సునీత, రామ్‌ల ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu