వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చనిపోయారు..? గ్రూప్ 2 ప్రశ్న

By telugu teamFirst Published Aug 31, 2019, 9:15 AM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎప్పుడు చనిపోయారు? రాష్ట్ర రాజధానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి లాంటి ప్రశ్నలు అడగటం గమనార్హం.
 


గ్రూపు-2 ప్రధాన పరీక్ష అభ్యర్థులను మూడు పేపర్లు ముప్పుతిప్పలు పెట్టాయి. గురువారం పేపరు-1 నిర్వహించగా.. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం పేపరు-2, 3 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్‌-2 మెయిన్స్‌ రెండో పేపరు (ఏపీ హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ) సులువుగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. కాగా... ఈ పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎప్పుడు చనిపోయారు? రాష్ట్ర రాజధానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి లాంటి ప్రశ్నలు అడగటం గమనార్హం.

పేపర్ చాలా సులభంగా వచ్చిందని... అందరూ 150కి 130 మార్కులు వచ్చేలా ఉందని కొందరు విద్యార్థులు తెలిపారు. గ్రూప్ 2 స్థాయి ప్రశ్నలు అడగలేదని.. మాజీ సీఎం వైఎస్ ఎప్పుడు చనిపోయారు..? ఆయన ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు లాంటివి మాత్రమే అడిగారని వారు తెలిపారు. అయితే మూడో పేపర్ మాత్రం చాలా కఠినంగా వచ్చిందని కొందరు విద్యార్థులు చెప్పారు.ఏపీ, ఇండియన్‌ ఎకానమీకి సంబంధించి సమపాళ్లలో ప్రశ్నలు అడగాల్సి ఉండగా ఇండియన్‌ ఎకానమీపైనే ఎక్కువ ప్రశ్నలున్నాయన్నారు. న్యూస్ పేపర్ చదివిన వారు మాత్రమే మూడోపేపర్ లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరని వారు తెలిపారు.

click me!