తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా: ఏపీలో కొత్తగా 20,065 కరోనా కేసులు.. 3 జిల్లాల్లో ఆందోళనకరం

Siva Kodati |  
Published : May 08, 2021, 07:59 PM IST
తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా: ఏపీలో కొత్తగా 20,065 కరోనా కేసులు.. 3 జిల్లాల్లో ఆందోళనకరం

సారాంశం

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,065 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి వీరవిహారం చేస్తోంది. నిన్న తగ్గినట్లే తగ్గిన కేసులు మరోసారి పెరిగిపోయాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,065 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,65,439కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 96 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,615కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 10, తూర్పుగోదావరి 9, పశ్చిమ గోదావరి 14, చిత్తూరు 6, గుంటూరు 10, కర్నూలు 7, నెల్లూరు 7, కృష్ణ 4, కడప 5, విశాఖపట్నం 12, శ్రీకాకుళం ముగ్గురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 19,722 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 10,69,432కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,01,571 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,72,62,441కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,87,392 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1741, చిత్తూరు 2269, తూర్పుగోదావరి 2370, గుంటూరు 1663, కడప 1178, కృష్ణ 1127, కర్నూలు 1421, నెల్లూరు 1515, ప్రకాశం 1083, శ్రీకాకుళం 1398, విశాఖపట్నం 2525, విజయనగరం 650, పశ్చిమ గోదావరిలలో 1125 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu