జనసేన లాంగ్‌మార్చ్‌లో అపశృతి: షార్ట్‌సర్క్యూట్, కార్యకర్తలకు గాయాలు

By sivanagaprasad KodatiFirst Published Nov 3, 2019, 5:41 PM IST
Highlights

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్ బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు కరెంట్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి. 

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్ బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు కరెంట్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి.

వేదిక వద్ద ఉంచిన బారికేడ్లలోకి విద్యతు సరఫరా అవ్వడంతో అక్కడే ఉన్న కార్యకర్తలకు ఎలక్ట్రిక్ షాకయ్యింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు జనరేటర్ నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాయాలపాలైన ఇద్దరు కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. 

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Also read:#JanaSenaLongMarch లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్న పవన్ కల్యాణ్

మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమయ్యే లాంగ్ మార్చ్.. రామాటాకీస్, ఆసీలుమెట్ట ప్రాంతాల మీదుగా మహిళా కళాశాల వద్దకు చేరుకుంటుంది. అనంతనం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ కూడ పాల్గొంటుంది.Also read:ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. పీకల మీదకి తెచ్చింది: నాగబాబు

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు భవన నిర్మాణకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

దీంతో భవన నిర్మాణకార్మికుల పనులు కల్పించేలా ఇసుక కొరతను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.

ఇసుక సమస్య ఈ స్థాయిలో విజృంభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం అనుకుని ఉండదన్నారు జనసేన నేత, సినీనటుడు నాగబాబు. విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వం గొంతుమీదకు వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని.. అయితే కోటిమందికి పైగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారి విలువను ప్రభుత్వం గుర్తించలేకపోయిందని నాగబాబు ఎద్దేవా చేశారు.

కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం ఇద్దామని పవన్ అన్నారని అయితే జగన్ సర్కార్‌కు అంత ఓపిక లేదేమోనంటూ దుయ్యబట్టారు. 

click me!