కంభంపాటిని పక్కనపెట్టిన బీజేపీ

By ramya neerukondaFirst Published Nov 22, 2018, 12:56 PM IST
Highlights

విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుని బీజేపీ పక్కనపెట్టేసిందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 

విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుని బీజేపీ పక్కనపెట్టేసిందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కంభంపాటే కొనసాగారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని కన్నా లక్ష్మీ నారాయణకు అప్పగించారు. అయితే.. తాజా పరిణామాలు చూస్తేంటే.. కంభంపాటిని పూర్తిగా దూరం చేశారేమో అనిపిస్తోంది.

ఎందుకంటే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనను కాదని వేరే వ్యక్తికి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.  ఇటీవల బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్ లను నియమించారు. కాగా.. విశాఖ కన్వీనర్ గా కంభంపాటిని కాదని.. కాశీ విశ్వనాథరాజుని నియమించారు. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా కంభంపాటిని కాదని.. విశ్వనాథరాజుకే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పార్టీ టికెట్ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే కంభంపాటి ఓ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే.. పార్టీ నేతలు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. అసలు కంభంపాటికి వచ్చే ఎన్నికలపై ఆసక్తి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథరాజు పేరు ఎక్కువగా వినపడుతోంది. 

click me!