తిరుమల వెంకన్న ఆలయం ఆదాయం తగ్గిపోతోంది. కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. గత నెల హుండీ ఆదాయం 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా 3 కోట్లు ఆదాయం వచ్చింది
తిరుపతి: తిరుమల వెంకన్న ఆలయం ఆదాయం తగ్గిపోతోంది. కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. గత నెల హుండీ ఆదాయం 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా 3 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇచ్చారు. కానీ ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు భక్తులకు తిరుమలలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. అయితే మే 8వ తేదీ నుండి ప్రతి రోజూ 12 వేల మంది భక్తులను అనుమతి ఇస్తున్నారు.
undefined
కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ తిరుమలలో భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. భక్తుల నుండి వచ్చే ఆదాయం కూడ తగ్గిపోయింది.కానీ ప్రతి నెల టీటీడీ రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల మేరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3200 కోట్లు. ఇందులో 1350 కోట్ల రూపాయలు జీతాలకే ఖర్చు అవుతోందని అధికారులు ప్రకటించారు.
కరోనాకు ముందు ప్రతి రోజూ తిరుమల వెంకన్నను 80 వేల నుండి లక్ష మంది భక్తులు దర్శించుకొనేవారు. కానీ ఇప్పుడు 12 వేల మంది మాత్రమే భక్తులు దర్శించుకొంటున్నారు.
ప్రతి నెలా టీటీడీ రూ. 120 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.ఎస్వీఐఎంఎస్, బీఐఆర్ఆర్డీ లాంటి సంస్థలకు టీటీడీ ప్రతి ఏటా కనీసం రూ. 400 కోట్లను గ్రాంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
మార్చి నుండి జూలై వరకు సుమారు 90 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం తగ్గినట్టుగా అధికారుల అంచనా.ఈ నాలుగు నెలల్లో టీటీడీకీ రూ. 270 కోట్ల ఆదాయం వచ్చింది. రూ. 260 కోట్లు వడ్డీల రూపంలో వచ్చింది. రూ. 30 కోట్లు దర్శనాల టిక్కెట్ల ద్వారా వచ్చింది.
తిరుమలలో లడ్డూ ప్రసాదాల విక్రయాలు 3.5 కోట్లు తగ్గాయి. తలనీలాలు సమర్పించే భక్తులు 36 లక్షలు తగ్గినట్టుగా టీటీడీ ప్రకటించింది. టీటీడీకి నెలకు రూ. 200 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే జూలైలో రూ. 19 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
మరోవైపు తిరుమల, తిరుపతిలో కూడ కరోనా కేసులు పెరిగిపోవడం కూడ టీటీడీపై ప్రభావం చూపుతోంది. టీటీడీలో పనిచేస్తున్న వారిలో 743 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 400 మంది కరోనా నుండి కోలుకొన్నారు.