బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ హత్య: శశికృష్ణను దోషిగా తేల్చిన కోర్టు

By narsimha lode  |  First Published Apr 29, 2022, 12:42 PM IST


గుంటూరు జిల్లాలో బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ కేసులో శశికృష్ణను కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది ఆగష్టు 15న రమ్యశ్రీని శశికృష్ణ హత్య చేశాడు. 


గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన  బీటెక్ స్టూడెంట్ Ramyasri కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు  శశికృష్ణను శుక్రవారం నాడు దోషిగా తేల్చింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెల్లడించనుంది. 

ఈ విషయమై నీవు ఏమైనా చెప్పుకోవాలని ఉందా అని జడ్జి శశికృష్ణ ను ప్రశ్నించారు. అయితే తన తల్లీ దండ్రులకు ఆరోగ్యం బాగా లేదని ఆయన చెప్పారు. అయితే నీకు విధించే శిక్షకు సంబంధించి నెల రోజుల సమయంలో అప్పీల్ చేసుకొనే అవకాశం కూడా ఉందని జడ్జి చెప్పారు.

Latest Videos

గత ఏడాది ఆగష్టు 15వ తేదీన తన ఇంటికి సమీపంలోని టిపిన్ సెంటర్ వద్ద రమ్యశ్రీని నిందితుడుShashi krishna కత్తితో పొడిచాడు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో 36 మంది సాక్షులను కోర్టు విచారించింది. 

Guntur జిల్లాలోని చేబ్రోలులోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో రమ్యశ్రీ B.tech చదువుతుంది. ఆగష్టు 15న తన ఇంటికి సమీపంలలోని టిఫిన్ సెంటర్ వద్ద శశికృష్ణ  రమ్యశ్రీని అత్యంత దారుణంగా కత్తితో పొడిచాడు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

గుంటూరు జిల్లాలోని చేబ్రోలులోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో రమ్యశ్రీ బీటెక్ చదువుతుంది. ఆగష్టు 15న తన ఇంటికి సమీపంలలోని టిఫిన్ సెంటర్ వద్ద శశికృష్ణ  రమ్యశ్రీని అత్యంత దారుణంగా కత్తితో పొడిచాడు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకు మండలం మట్లూరు గ్రామానికి చెందిన కుందాల శశికృష్ణను ఘటన 48 గంటల్లో  పోలీసులు అరెస్ట్ చేశారు.ఇన్‌స్టా గ్రామ్ లో రమ్యశ్రీ, శశికృష్ణకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత శశికృష్ణ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. కానీ శశికృష్ణను ఆమె దూరం పెట్టింది. తనను ప్రేమించకపోతే చంపేస్తానని కూడా హెచ్చరించాడు. 

అయితే ఆగష్టు 15న  రమ్యశ్రీని  పిలిపించి హత్య చేశాడు శశికృష్ణ.. హత్యకు ముందు ఎనిమిది నిమిషాలు నిందితుడు ఆమెతో మాట్లాడాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.  తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు శశికృష్ణను అడ్డుకొంటే రమ్యశ్రీ బతికేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ క్రమంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను గమనించిన బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు.

ఈ కేసు విషయమై అప్పట్లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగింది.  గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 9 మాసాల్లో ఈ కేసు విచారణను పూర్తి చేసింది. శశికృష్ణ ఈ కేసులో నిందితుడిగా తేల్చింది.


 


 

click me!