రాయలసీమలో ఆయుధాలపై ఆరునెలల నిషేధం... రాష్ట్ర హోంశాఖ నిర్ణయం

By Arun Kumar PFirst Published Jul 15, 2021, 11:55 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ నేరాలను తగ్గించేందుకు హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పదునైన ఆయుధాలపై ఆరునెలల నిషేధం విధిస్తూ హోంశాఖ ఆదేశాలు వెలువడ్డాయి. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పదునైన ఆయుధాలపై నిషేదాన్ని కొనసాగించాలని హోంశాఖ నిర్ణయించింది. రాయలసీమలోని అన్ని జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదును కలిగిన ఆయుధాలపై నిషేధాన్ని పొడిగిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 4 ప్రకారం ఈ నిషేధాన్ని విధించారు. జులై 15వ తేదీ నుంచి మరో ఆరునెలల పాటు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ హోంశాఖ  ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు హోంశాఖ ఈ నిషేధాన్ని విధించింది. ఎక్కువగా పదునైన ఆయుధాలను ఉపయోగించి నేరాలకు పాల్పడే జిల్లాల్లో ఈ నిషేధాన్ని విధించారు. ప్యాక్షన్ నేపథ్యం కలిగివుండటంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ ఆయుధాలపై నిషేధాన్ని విధించారు. 

 

click me!