వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి మధ్య అక్రమసంబంధం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా విజయసాయి చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయిన శాంతి భర్త మదన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.. ఏమన్నారంటే...
Vijayasai Reddy Kalingiri Shanthi : మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగా వుంది ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి పరిస్థితి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైసిపి నాయకులపై టిడిపి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి సమయంలో వైసిపి కీలక నాయకుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ అధికారితో ఆయన అక్రమ సంబంధం కలిగివున్నారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ దుమారం రేపుతోంది.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ కళింగిరి శాంతితో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అక్రమ సంబంధం వుందంటూ ప్రచారం జరుగుతోంది. స్వయంగా శాంతి భర్త మధన్ మోహనే ఈ అక్రమ సంబంధం వ్యవహారాన్ని బయటపెట్టారు. తాను అమెరికాలో వుండగా విజయసాయితో కలిసి తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందని మదన్ ఆరోపిస్తున్నారు.
అయితే ఇప్పటికే తనకు విజయసాయి రెడ్డితో ఎలాంటి అక్రమం సంబంధం లేదని... వృత్తిపరమైన విషయాల్లో భాగంగానే ఆయనను కలిసినట్లు శాంతి అంటున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి కూడా తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపారు. తనపై టిడిపి అనుకూల మీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. కొన్ని మీడియా సంస్థలు, యాంకర్ల పేర్లను ప్రస్తావిస్తూ బూతులు తిట్టారు ఎంపీ. ఇలా విజయసాయి రెడ్డి, శాంతి తమకేమీ సంబంధం లేదంటూ చేసిన కామెంట్స్ పై మదన్ మోహన్ మరోసారి రియాక్ట్ అయ్యారు.
విజయసాయి రెడ్డికి శాంతి భర్త కౌంటర్ :
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి తన భార్యతో ఎలాంటి సంబంధం లేకుంటే డిఎన్ఏ టెస్ట్ అంటే ఎందుకు భయపడుతున్నారు..? అని మదన్ మోహన్ నిలదీసారు. తాను అమెరికాలో వుండగా భార్య శాంతి బిడ్డకు జన్మనిచ్చింది... ఆ బిడ్డ ఎవరివల్ల కలిగారో తేలాల్సి వుందన్నారు. సుభాష్ రెడ్డి అనే వ్యక్తితో తనకు రెండోపెళ్లి అయినట్లు శాంతి చెబుతున్నదంతా అబద్దమేనని... ఈ విషయంపై అతడితో మాట్లాడినట్లు మదన్ తెలిపారు. శాంతికి పుట్టిన బిడ్డతో తనకు ఏ సంబంధమూ లేదని సుభాష్ చెప్పినట్లుగా మదన్ పేర్కొన్నారు.
అయితే తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయాలి... అందుకోసం శాంపిల్స్ ఇవ్వడానికి తాను సిద్దమేనని మదన్ అన్నారు. ఏ సంబంధమూ లేదంటున్నావుగా... నువ్వు సిద్దమేనా విజయసాయి రెడ్డి? అని ప్రశ్నించారు. డిఎన్ఏ టెస్ట్ కు ముందుకు వచ్చి నీ నిజాయితీని నిరూపించుకోవాలి...లేదంటే ఆ బిడ్డ నీకే పుట్టినట్లు నిర్దారించుకోవాల్సి వస్తుందన్నారు. డిఎన్ఏ టెస్ట్ లో తన భార్యకు పుట్టిన బిడ్డతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణలు చెబుతానని మదన్ అన్నారు.
ఇక భార్య శాంతి తనతో విడాకులు తీసుకున్నట్లు చెబుతున్నదంతా అబద్దమేనని మదన్ తెలిపారు. 2013 లో శాంతిని వివాహం చేసుకున్నాను... 2020 లో ఆమెకు ఉద్యోగం వచ్చిందన్నారు. అప్పటివరకు మేమిద్దరం కలిసే వున్నాము... 2021 లో పిహెచ్‌డీ కోసం తాను అమెరికా వెళ్ళినట్లు మదన్ తెలిపారు. అప్పటినుండే భార్య ప్రవర్తన విచిత్రంగా మారిందని... అనుమానం వచ్చి తీరు మార్చుకోవాలని చాలాసార్లు హెచ్చరించినట్లు తెలిపారు.
అయితే విశాఖపట్నంలో పనిచేసే సమయంలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డితో పరిచయం ఏర్పడినట్లు శాంతి తనను చెప్పిందన్నారు మదన్. ఆయనకు ఓ ల్యాండ్ విషయంలో హెల్ప్ చేస్తున్నానని చెబితే నమ్మానన్నారు. తనకు కూడా విజయసాయి రెడ్డి పరిచయం చేసిందన్నారు. అయితే ఓరోజు సడన్ గా విజయవాడలో రూ.4 కోట్లతో విల్లా కొందామని ... డబ్బులు విజయసాయి ఇస్తానన్నారని భార్య శాంతి చెప్పిందని మదన్ వెల్లడించారు.
తాను అమెరికాలో వుండగానే భార్య శాంతి గర్భం దాల్చింది... విషయం తెలిసి ఇదేంటని ప్రశ్నిస్తే తననే బెదిరించిందని మదన్ తెలిపారు. ఎవరి వల్ల గర్భవతివి అయ్యావని అడిగితే చెప్పుతో కొడతానంటూ తిట్టిందన్నారు. గట్టిగా అడిగితే విజయసాయి రెడ్డి పేరు చెప్పింది... ఆయనకు పిల్లలు లేరు కాబట్టి తనద్వారా మగబిడ్డను కన్నారని తెలిపిందన్నారు. ఫిజికల్ గా కలిసారో లేక ఐవిఎఫ్ ద్వారానో తెలియదుగానీ తన బార్య శాంతి మాత్రం విజయసాయి రెడ్డి ద్వారానే బిడ్డను కనిందని మదన్ చెబుతున్నారు.
తన భార్య శాంతి చేసిన పనిగురించి తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చానని మదన్ అన్నాడు. గత మూడు నెలల నుంచి శాంతి టార్చర్ మరీ ఎక్కువయ్యిందని అన్నాడు. ఇక ఆమె చేష్టలను భరించలేకే ఈ విషయం బయటపెట్టినట్లు మదన్ తెలిపారు.
ఇప్పటికీ తాను శాంతి విడాకులు తీసుకోలేదు... 2016లోనే తీసుకున్నట్లు చెబుతున్నదంతా అబద్దమేనని మదన్ తెలిపారు. 2024 జూన్ 11న అంటే గత నెలలో విడాకుల డాక్యుమెంట్ పై సంతకం పెట్టానన్నారు. ప్రతినెలా తన పిల్లల పోషణ కోసం శాంతికి డబ్బులు పంపిస్తున్నట్లు మదన్ తెలిపారు.