మైనర్ బాలికపై అత్యాచారయత్నం... యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2021, 04:21 PM ISTUpdated : Jun 04, 2021, 04:24 PM IST
మైనర్ బాలికపై అత్యాచారయత్నం... యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు

సారాంశం

మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

విజయవాడ: మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించమే కాదు అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ యువకుడిపై కేసు నమోదయ్యింది. ఈ దారుణం సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని పెజ్జోని పేటలో ఏడో తరగతి చదివే మైనర్ బాలిక(15) కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పచ్ఛిమర్ల చిరంజీవి (27) బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఇవాళ బాలిక ఒంటరిగా కనిపించడంతో బలవంతంగా ఓ భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  

అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడ్డ బాలిక కేకలు వేసింది. దీంతో యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిరంజీవిపై  పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

read more  వైద్య విద్యార్థినిపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులు... మహిళా కమీషన్ సీరియస్ (వీడియో)

ఇదిలావుంటే కూతురు వయసు విద్యార్థినితో నెల్లూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. విద్యార్థినితో తన రూమ్ కి రమ్మంటూ.. నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుడి కారణంగా తాను పడిన వేదనను సదరు విద్యార్థిని ఆడియో రికార్డు చేయగా.. ఇప్పుడు అది బయటకు వచ్చింది.

''నువ్వు నా సోల్ మేట్.. లైఫ్ పార్ట్ నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏంటి సార్..? నా వయసు 23ఏళ్లు. నాకు తెలిసి మీ పిల్లలకు కూడా ఇదే వయసు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా.. ఎందుకు ఫోన్ చేస్తున్నారు..? రెస్టారెంట్లు, బీచ్ కి రమ్మని అడుగుతున్నారు.. నీ రూమ్ లో ఏసీ లేదుగా.. నా రూమ్ కి  రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్? నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నెంబర్ బ్లాక్ చేస్తే.. మరో నెంబర్ నుంచి ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నారు? మీ వేధింపుల కారణంగా పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నాను'' అంటూ బాధిత విద్యార్థిని  పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై ఇప్పటికే  జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్  విచారణకు ఆదేశించారు. 


 

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
IMD Rain Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, ఇక అల్లకల్లోలమే..!