నారా లోకేష్ పీఏ లైంగిక వేధింపులు... టిడిపి కార్యాలయం వద్ద మహిళా నేతల ఆందోళన

By Arun Kumar PFirst Published Jan 19, 2022, 1:19 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తిగత సిబ్బంది (పీఏ ఆండ్ టీం) లైంగికంగా వేధిస్తున్నారంటూ తెలుగు మహిళా నాయకురాళ్లు ఏకంగా టిడిపి జాతీయ కార్యాలయం ఎదుటే ఆందోళనకు దిగారు. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) వ్యక్తిగత సహాయకుడిపై (PA) అదేపార్టీకి చెందిన మహిళా నాయకురాళ్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. లోకేష్ పీఏ సాంబశివరావుతో పాటు ఆయన బృందంలోకి వారు మహిళా నాయకులు, కార్యకర్తలపై లైంగిక వేధింపుల (sexual harassment)కు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరికి చెందిన తెలుగుమహిళా నాయకురాల్లు ఎక్కువగా లోకేష్ పీఏ వేధింంపులకు గురవుతున్నారని మహిళలు ఆరోపించారు. 

గుంటూరు జిల్లా (guntur district) మంగళగిరి (mangalagiri)లోని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం (TDP Head Office) వద్ద మహిళలు ధర్నాకు దిగారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన పాలేటి కృష్ణవేణి (paleti krishnaveni) తనను టిడిపి నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మరికొందరు మహిళలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న లోకేష్ పీఏ సాంబశివరావు, అతడి టీంపై కూడా చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేసారు. 

గతంలో కృష్ణవేణి మంగళగిరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. ఈ సమయంలోనే సాంబశివరావుతో పాటు ఆయన టీం మహిళా నాయకురాళ్లను, కార్యకర్తలను లైంగిక వేధింపులకు దిగినట్లు ఆరోపణలు వచ్చినట్లు మహిళలు చెబుతున్నారు.

బడుగు బలహీన వర్గాలకు దళితులకు తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం లేదని ధర్నాకు దిగిన మహిళలు విమర్శించారు. ముఖ్యంగా దళితులకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఒక్క పదవయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

గత ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నిలబెట్టిన అభ్యర్థులను సైతం కొందరు సొంతపార్టీ నాయకులే ఓడించారని మహిళలు వాపోయారు. ఇలాంటి వారిలో ఒకరయిన పోతినేని శ్రీనివాసరావు (pothineni srinivas rao)ను ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయరు? సస్పెండ్ చేయడానికి మాలాంటి బడుగు బలహీన వర్గాల నాయకులే దొరికారా? అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు. 

ఇదిలావుంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తనయుడు రాఘవేంద్ర లైంగిక వేధింపులు ఓ కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్న ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని పంచాయితీలు చేసే వనమా రాఘవ ఓ వివాహితపై కన్నేసాడు. ఈ క్రమంలోనే బరితెగించిన అతడు సాయం కోరి వచ్చిన వివాహిత భర్తతోనే భార్యను తనవద్దకు పంపించాలని అడిగాడు. ఇలా ఏ భర్తా వినకూడని మాటలను ఎమ్మెల్యే తనయుడి నోట విన్న వ్యక్తి మనస్థాపంతో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ నెల 3వ తేదీన కొత్తగూడెం నియోజకవర్గ పరిిధిలోని  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్న కూతురు సాహితీ కూడా మరణించింది.

అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని వనమా రాఘవేందర్ తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ప్రశ్నించారు.

నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు.రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని  రామకృష్ణ అడిగారు.  వనమా రాఘవ వల్ల ఎన్నో  కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. 

 

click me!