2017లో జగన్ 7 వైఫల్యాలు

First Published Dec 27, 2017, 2:31 PM IST
Highlights
  • ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నప్పటికీ కొన్ని  వైఫల్యాలు కొట్టొచ్చినట్లు వెన్నాడుతున్నాయ్.

ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నప్పటికీ కొన్ని  వైఫల్యాలు కొట్టొచ్చినట్లు వెన్నాడుతున్నాయ్.

 

1-అవినీతి ఆరోపణలు: జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణలు గతంలో ఏ నేతపైన కూడా లేవన్నది వాస్తవం. అక్రమాస్తులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. కేసులన్నీ రాజకీయ ప్రేరేపితాలే అని జగన్ చెప్పుకుంటున్నప్పటికీ కేసుల్లో నుండి బయటపడలేకపోవటం జగన్ కు పెద్ద సమస్యగా తయారైంది.

2-ఎంఎల్ఏలు, ఎంపిలు జారి పోతున్నారు: పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిల్లో పలువురు టిడిపిలోకి ఫిరాయించారు. 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోవటం  జగన్ బలహీనతగానే కనబడుతోంది.

3-అసెంబ్లీ బహిష్కరణ: ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సరైన వేదిక అయిన అసెంబ్లీని బహిష్కరించాలన్న జగన్ నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు నిరసనగా ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరిచాలనుకోవటంపై పార్టీలో కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది.

4-ప్రతిపక్షాలను కలుపుకోలేకున్నారు: ఎంతసేపు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఒంటిరి పోరాటమే చేస్తున్నారు. ప్రతిపక్షాలను కలుపుకుని ఐక్య పోరాటాలు చేయటంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు విస్తృతంగా వినబడుతున్నాయి.

5-ఎంపిల రాజీనామాలు: ‘మాట తప్పను మడమ తిప్పను’ అని తరచూ చెప్పుకునే జగన్ ఎంపిల రాజీనామా విషయంలో మాట తప్పారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తన ఎంపిలతో రాజీనామా చేయిస్తానంటూ ఓ బహిరంగ సభలో ప్రకటించారు. తర్వాత ఆ విషయంపై మాటమార్చి నవ్వుల పాలయ్యారు.

6-ఉపఎన్నికల్లో పరాభవం: తనను తాను ఎక్కువగా ఊహించుకుని నంద్యాల ఉప ఎన్నికలో బోర్లా పడ్డారు. అదే విధంగా స్ధానిక సంస్ధల్లో బలమున్నా కర్నూలు స్దానిక సంస్ధల ఎంఎల్సీ ఉపఎన్నికలో ఏకంగా పొటీ నుండే తప్పుకున్నారు. చంద్రబాబు ఎత్తులను జగన్ తట్టుకోలకపోతున్నారన్న అపఖ్యాతిని మూటకట్టుకున్నారు.

7-మీడియా సహకారం: స్వయంగా మీడియా అధిపతి అయ్యుండి కూడా మిగిలిన మీడియా సహకారాన్ని పొందలేకపోవటం జగన్ వైఫల్యంగానే చెప్పుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఎంతసేపూ తన సొంత మీడియా ద్వారా మాత్రమే జనాలకు చెప్పుకోవాల్సి వస్తోంది.

 

 

 

click me!