ఏడు నెలల పసికందు పెదాలు, మర్మావయాలపై గాయాలు.. రాత్రి తల్లిపక్కలో.. తెల్లారి ముళ్లపొదలో అపస్మారకస్థితిలో....

By AN Telugu  |  First Published Jul 21, 2021, 10:09 AM IST

సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారేసరికి లేచి చూస్తే ఊయలలో పాప కనిపించలేు. దీంతో ఆందోళన చెందిన తల్లి పాప కోసం వెదుకులాట ప్రారంభించింది.


గుంటూరు : రాత్రి ఊయలలో చక్కగా నిద్రపోయిన చిన్నారి.. తెల్లారిలేచేసరికి ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద గాయాలున్నాయి. పసికందుమీద అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ సంఘటన వెలుగు చూసింది. 

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7నెలల పసికందును నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారేసరికి లేచి చూస్తే ఊయలలో పాప కనిపించలేు. దీంతో ఆందోళన చెందిన తల్లి పాప కోసం వెదుకులాట ప్రారంభించింది.

Latest Videos

వారుండే ఇంటికి కొద్ది దూరాన నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని గుర్తించింది. ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె చెరువైంది. 

హుటాహెటిన మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప పెదాలపై, మర్మావయాలపై గాయాలు ఉండటంతో వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించి గుంటూరు జీజీహెచ్ కు రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి, విజయపురి సౌత్ ఎస్ ఐ అనిల్ కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. 

గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించారు. చిన్నారికి జీజీహెచ్ లో చికిత్స పొందుతోందని, వైద్యాధికారుల నుంచి నివేదిక వచ్చాకే అఘాయిత్యం జరిగింది, లేనిది తేలుతుందని సీఐ భక్తవత్సలరెడ్డి పేర్కొన్నారు. దీనిమీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారేమోనని తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రశాంతి చూసి తల్లిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలనిి వైద్యులకు సూచించారు. 

click me!