గోదావరిలో పడవ బొల్తా.. వాళ్లు బతకడం కష్టమే.. సహాయక చర్యలకు వర్షం ఆటంకం

First Published Jul 15, 2018, 10:58 AM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో నాటు పడవ బొల్తా పడిన సంగతి తెలిసిందే..ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో నాటు పడవ బొల్తా పడిన సంగతి తెలిసిందే..ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు తోడు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటి ఉదృతి బాగా పెరిగింది. అయినప్పటికీ పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ దగ్గరుండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారిలో ఆరుగురు విద్యార్థినులు, ఓ వివాహిత ఉన్నారు..మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు.. వీరంతా శేరిలంక, కమిని, సలాదివారిపాలెం, వలసలతిప్ప, సీతారామపురం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతై ఇప్పటికి చాలా సమయం అవుతుండటంతో వీరంతా బతికే అవకాశాలు లేవని కొందరు మత్స్యకారులు భావిస్తున్నారు.

click me!