కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: తొమ్మది మంది మృతి

First Published Jun 24, 2018, 8:46 AM IST
Highlights

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


కర్నూల్:కర్నూల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవాళ తెల్లవారుజామున కర్నూల్ -నంద్యాల ప్రధాన రహదారిపై ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్నూల్ జిల్లా కోడుమూరు మండలంలోని పెనుగొండ్ల, కలపారి గ్రామాలకు చెందిన ప్రయాణీకులు నాటు వైద్యం కోసం మహానందికి మూడు  ఆటోల్లో బయలుదేరారు. రెండు ఆటోలు సోమయాజులపల్లెను దాటి వెళ్ళాయి. కానీ, మూడు ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో ఆటోను నడపడం వల్ల ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది.

. ప్రమాదం  జరిగిన సమయంలో ఆటోలో 13 మంది ప్రయాణీస్తున్నారని పోలీసులు తెలిపారు.మృతుల్లో అత్యధికులు వృద్దులేనని పోలీసులు చెప్పారు.కంటి పరీక్షల కోసం వారంతా మహానందికి వెళ్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. రాంగ్ రూట్‌లో ఆటోను నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

ప్రమాదాన్ని నివారించేందుకు ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు. అయితే బస్సు డ్రైవర్ వేగాన్ని తగ్గించారు. అయితే ఆటో డ్రైవర్ ఆటోను ఎటుువైపు తీసుకెళ్తాన్నారనే విషయమై కొంత గందరగోళం సృష్టించారు.దీంతో బస్సు డ్రైవర్ ఆటో ఎటు వైపు మళ్ళుతోందనే అంచనా వేయలేకపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

click me!