పద్మావతి సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సేవ‌లు భేష్.. టీటీడీని అభినందించిన సుధా నారాయ‌ణ మూర్తి

By team teluguFirst Published Aug 4, 2022, 9:52 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ పద్మావతి హాస్పిటల్ లో పేదలకు మంచి మెరుగైన సేవలు అందుతున్నాయని సుధా నారాయణ మూర్తి అన్నారు. టీటీడీని అభినందించారు. 

తిరుపతిలోని శ్రీ పద్మా వతి బాలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో టీటీడీ కృషిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ ప‌ర్స‌న్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సుధా నారాయణ మూర్తి అభినందించారు. మంగళవారం ఆమె ఆస్ప త్రిలోని ఐసీయూ, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్ల‌ను సంద‌ర్శించారు. అనంతరం సుధామూర్తి మాట్లాడుతూ.. తిరుపతిలోని టీటీడీ ఆస్పత్రిలో పేద రోగులకు ఉచితంగా అందజేస్తున్న వైద్య సదుపాయాలు అమోఘమని పేర్కొన్నారు. నిస్వార్థంగా, నిబద్ధతతో సేవలందిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని ఆమె అభినందించారు.

రాయలసీమలో భారీ వర్షాలు: లోతట్టు ప్రాంతాలు జలమయం, నదులకు పోటెత్తిన వరద

అనంత‌రం టీటీడీ ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆసుపత్రి ప్రారంభించిన నాటి నుంచి గడిచిన ఆరు నెలల కాలంలో 500లకు పైగా చిన్నారులకు గుండె చికిత్స‌లు చేశామ‌ని అన్నారు. రోజుల వయసున్న శిశువులకు కూడా ఆపరేషన్ చేసి విజయవంతంగా చికిత్స చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.20-25 లక్షల మధ్య ఖర్చుతో కూడిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స లు అవసరమైన రోగులకు త్వరలో ఉచితంగా నిర్వ హించేందుకు టీటీడీ సర్వసన్నద్ధంగా ఉందని ఏ.వీ ధర్మారెడ్డి తెలిపారు. దాతల సహకారంతో అత్యాధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంద‌ని చెప్పారు. 

కుప్పంలో చంద్రబాబుకు ఎసరు: పక్కా ప్లాన్ తో వైఎస్ జగన్

కాగా.. బంగ్లాదేశ్ రోగి భారతదేశ గొప్పతనాన్ని ప్రశంసించారు, ఢాకాకు చెందిన బంగ్లాదేశ్ జాతీయుడు మహమ్మద్ అబుల్ కసన్ ఐదేళ్ల కుమార్తె షహీబా టీటీడీ నిర్వ హిస్తున్నస్తు శ్రీ పద్మా వతి హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతోంది.  బాలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వెంకటేశ్వర స్వామి దివ్య కృపతో కుల, మత, మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఎవరికైనా ఉచిత వైద్య సేవలు అందించడం భారతదేశ గొప్ప తనమని పేర్కొన్నారు.  చిన్నారి వైద్య రికార్డులను ఈ మెయిల్ లో పంపిన త‌రువాత హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీనాథ్ రెడ్డి జులై 24వ తేదీన హాస్పిట‌ల్ కు రావాల్సిందిగా కోరార‌ని అన్నారు. జూలై 29వ తేదీన తన కుమార్తె శస్త్ర చికిత్సను ఉచితంగా నిర్వహించారని, అందుకు టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని చెప్పారు. నిరుపేదల వైద్య అవసరాలను పరిష్కరించడానికి ఇలాంటి గొప్ప చొర‌వ తీసుకుంటున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

click me!