తిరుమలలో సర్వర్లు డౌన్.. గదుల కోసం భక్తుల ఇబ్బందులు

By Siva Kodati  |  First Published Mar 13, 2021, 5:12 PM IST

తిరుమలలో సర్వర్లు మొరాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి గదుల కేటాయింపుల కేంద్రంలో చాలా సేపు సర్వర్లు మొరాయించాయి. దీంతో రెండు గంటలుగా వసతి గదుల కేటాయింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కాగా,తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక  బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

Latest Videos

undefined

ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవమూర్తులు‌, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 నుండి 8.10 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు.

ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. ఈరోజు రాత్రి పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.  బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
click me!