నీ పనులు నీకే శాపాలుగా తగుల్తాయ్: పేర్ని నానికి కొల్లు రవీంద్ర కౌంటర్

Siva Kodati |  
Published : Mar 13, 2021, 03:03 PM IST
నీ పనులు నీకే శాపాలుగా తగుల్తాయ్: పేర్ని నానికి కొల్లు రవీంద్ర కౌంటర్

సారాంశం

తన అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా వుందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో వుండి పేర్ని నాని భాష ఏంటీ అంటూ మండిపడ్డారు.

తన అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా వుందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో వుండి పేర్ని నాని భాష ఏంటీ అంటూ మండిపడ్డారు.

తనను ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియకుండా పేర్ని నాని మాట్లాడుతున్నారని కొల్లు ఎద్దేవా చేశారు. పేర్నినానిపై ఎవరో తాపీతో దాడి చేస్తే.. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయాందోళనలు సృష్టించారని రవీంద్ర ఆరోపించారు. మంత్రి పేర్ని నాని చేసే ప్రతి పని వారికే శాపాలై తగులుతాయని కొల్లు వ్యాఖ్యానించారు. 

అంతకుముందు మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. సానుభూతి రాజకీయాలు కాదు స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలని ఆయన హితవు పలికారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్యా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తే కేసులు పెట్టరా అని మంత్రి ప్రేశ్నించారు. అక్రమ కేసులు పెట్టారని కొల్లు రవీంద్ర మాట్లాడటాన్ని పేర్ని నాని ఖండించారు.

ఏ కేసు అక్రమంగా పెట్టారో చెప్పాలని నాని ప్రేశ్నించారు. మీపైన ఉన్నది రాస్తారోకో కేసు, కోవిద్ సెంటర్లోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, మోకా భాస్కరరావు హత్య కేసు వీటిని పెట్టింది పోలీసులేనన్నారు. మరి వీటిలో అక్రమ కేసులు ఏవి? ఇక్కడ కూడా సానుభూతి నీచ రాజకేయాలేనా అని నాని ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

Free Bus: విద్యార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. ఆ రోజు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం
Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu