ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

By Siva KodatiFirst Published May 27, 2019, 10:35 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో  అత్యున్నత స్థాయి అధికారుల కూర్పుపై దృష్టి సారించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో  అత్యున్నత స్థాయి అధికారుల కూర్పుపై దృష్టి సారించారు. సీఎం పేషీతో పాటు ముఖ్య శాఖల కార్యదర్శలు తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా సమర్ధుడైన అధికారిని నియమించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ ఇంటెలీజెన్స్ చీఫ్‌గా తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన అనుభవం రవీంద్రకు ఉంది. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. 

ఆదివారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ సందర్భంగా జగన్.. రవీంద్ర డిప్యూటేషన్‌ విషయాన్ని ప్రస్తావించగా ప్రధాని సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో పాటు డీవోపీటీ అనుమతించడంతో రవీంద్ర నియామకంగా లాంఛనమే. ఈ నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్ర మంగళవారం అమరావతిలో వైఎస్ జగన్‌ను కలవనున్నారు. 

click me!