ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శాఖపరమైన విచారణకు హాజరయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శాఖపరమైన విచారణకు హాజరయ్యారు.
తనపై వచ్చిన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఈ విచారణ సందర్భంగా కమిషనర్ ఆఫ్ ఎంకైర్వీస్ విచారణ నిర్వహించింది. ఈ విచారణకు హాజరుకావాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు రావాలని గతంలోనే సమాచారం పంపింది.
విచారణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు హాజరై తన అభిప్రాయాన్ని అందించారు. లిఖితపూర్వకంగా ఏబీ వెంకటేశ్వరరావు తన వాదనను విచారణ కమిషనర్ కు అందించారు.
ఈ విచారణకు హాజరుకావాలని మాజీ ఏపీ డీజీపీలు జేవీ రాముడు, సాంబశివుడు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూరులను రావాలని మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
ఇదే విషయమై ఆయనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కోర్టులను ఆశ్రయించారు.