టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌‌కు సెక్యూరిటీ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..

Published : Jul 11, 2022, 11:16 AM ISTUpdated : Jul 11, 2022, 11:22 AM IST
టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌‌కు సెక్యూరిటీ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీని విత్ డ్రా చేసింది. పయ్యావుల గన్‌మెన్లను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీని విత్ డ్రా చేసింది. పయ్యావుల గన్‌మెన్లను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు 1+1 భద్రత ఉంది. అయితే తాజాగా దానిని ప్రభుత్వం ఉపసహరించింది. ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సెక్యూరిటీ విత్ డ్రా‌ చేయడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పెగాసస్‌ వ్యవహారంపై పయ్యావుల మాట్లాడుతూ.. ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనకు భద్రతను ఉపసంహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సెక్యూరిటీ తొలగింపుపై పయ్యావుల మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.  

టీడీపీ హయాంలో పెగాసస్ వినియోగించారని అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ ఎక్విప్‌మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసెస్ ఎక్విప్‌మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్‌టీఏ ద్వారా సమాధానం ఇచ్చారని పయ్యావుల గుర్తుచేశారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని పయ్యావుల ఆరోపించారు.

పెగాసెస్ పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రయాసే అయ్యిందని.. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్ గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని కేశవ్ ధ్వజమెత్తారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లు ఏ ఎమ్మెల్యే వాడటం లేదన్నారు.  సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై నిరర్థకంగా కొనసాగిస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు.

రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా అని పయ్యావుల ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా అని కేశవ్ సవాల్ విసిరారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?