సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు.. తాడేపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు..

Published : Nov 28, 2022, 12:02 PM ISTUpdated : Nov 28, 2022, 12:06 PM IST
సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు.. తాడేపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. సీఎం జగన్ నివాస ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారిని ఎస్టీల్లో తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస మట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస పరిసరాల్లో భారీగా  బలగాలను మోహరించారు. 

ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాల్లో మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గాలైన ఎన్టీఆర్ కట్ట, పాత టోల్ గేట్ కూడలి, తాడేపల్లి పశువైద్యశాల మార్గం, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆ మార్గాల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్