చంద్రబాబు నివాసం వద్ద భద్రత తగ్గింపు

Published : Jun 27, 2019, 09:35 AM IST
చంద్రబాబు నివాసం వద్ద భద్రత తగ్గింపు

సారాంశం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇటీవల భద్రత కుదించిన సంగతి తెలిసిందే.  


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇటీవల భద్రత కుదించిన సంగతి తెలిసిందే.  ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ కి కూడా జెడ్ ప్లస్ క్యాటగిరినీ తొలగించి 2+2 భద్రతకు కుదించారు. ఇక ఇతర కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించారు. తాజాగా చంద్రబాబు స్వగృహం వద్ద కూడా భద్రతను కుదించారు.

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగృహం వద్ద ఏపీఎస్పీ పోలీసు భద్రతను తొలగించారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇన్నాళ్లు ఏపీఎస్పీ బెటాలియన్‌ ఆర్‌ఎస్సై, ఏఎస్సై, అయిదుగురు కానిస్టేబుళ్లు, చంద్రగిరి స్టేషన్‌ ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించేవారు.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu