జగన్ ఆదేశాల ఆంతర్యం: చంద్రబాబుపై లీగల్ చర్యలు తప్పవా?

By telugu teamFirst Published Jun 26, 2019, 9:22 PM IST
Highlights

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన సోలార్‌, విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ఒప్పందాలపైన జగన్ సమీక్ష చేశారు. ఆ స‌మీక్ష‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా గుర్తించి, దీనికి బాధ్యులైన వారిపైన చ‌ర్య‌లకు ఆదేశించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం నేపథ్యంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై లీగల్ చర్యలు తప్పవా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర అధికారులు వద్దని చెప్పినా వినకుండా ప్ర‌ధాని నరేంద్ర మోడీని ఒప్పించి ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు జగన్ అడుగులు వేశారనే ప్రచారం సాగుతోంది. 

గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిపైన చ‌ర్య‌ల దిశ‌గా జగన్ కీల‌క నిర్ణయం ప్ర‌క‌టించారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికితీసేందుకు మంత్రివ‌ర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. మొత్తంగా 30 అంశాల‌పై విచార‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యుత్ పీపీఏల్లో అక్ర‌మాలు జ‌రిగాయని, వాటికి బాధ్యులైనవారిపైనే కాకుండా అవ‌స‌ర‌మైతే నాటి ముఖ్యమంత్రి మీద లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

పీపీఏల పైన స‌మీక్ష‌లు వ‌ద్ద‌ని, స‌మీక్షించి చ‌ర్య‌లు తీసుకుంటే అవి వ్య‌తిరేక ప్ర‌భావానికి కార‌ణ మ‌వుతాయని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనకాడుతారని కేంద్ర అధికారులు నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ ఆ మధ్య లేఖ రాశారు. అయితే, కేంద్ర అధికారులు అభ్యంత‌రం చెబుతున్న విష‌యాన్ని తిరుప‌తికి వ‌చ్చిన స‌మయంలో జగన్ నేరుగా ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

మోడీ అనుమతి ఇవ్వడంతో వెంట‌నే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన సోలార్‌, విండ్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ఒప్పందాలపైన జగన్ సమీక్ష చేశారు. ఆ స‌మీక్ష‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా గుర్తించి, దీనికి బాధ్యులైన వారిపైన చ‌ర్య‌లకు ఆదేశించారు.

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనే వైయ‌స్ జ‌గ‌న్ నాటి ప్ర‌భుత్వం పీపీఏల పైన ఆందోళ‌న‌కు దిగారు. టీడీపీ ప్ర‌భుత్వం హయాంలో జరిగిన కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై జ‌గ‌న్ దృష్టి సారించారు. సోలావర్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని అంటూ ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. 

కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. 

టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మ‌రో కీలక నిర్ణయం తీసుకున్నా రు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 

మొత్తం 30 అంశాలపై విచారణ చేయిస్తామని చెప్పారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సంస్థల సహకారం తీసుకోవాల‌ని అధి కారుల‌కు ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేసారు. దీంతో ఇప్పుడు పీపీఏల పైన అధికారులు ఇచ్చిన స‌మాచారం అధారంగా లీగల్ చ‌ర్య‌లు ఉండే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. ప్ర‌ధానంగా నాటి విద్యుత్ శాఖ ప‌ర్య‌వేక్షించిన కీల‌క అధికారులు, అప్పటి మంత్రి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. 

click me!