రాజమండ్రి టీడీపీ సభలో కిందపడబోయిన బాబు, కాపాడిన సెక్యూరిటీ

Published : Jan 29, 2024, 03:52 PM ISTUpdated : Jan 29, 2024, 05:40 PM IST
రాజమండ్రి టీడీపీ సభలో కిందపడబోయిన బాబు, కాపాడిన సెక్యూరిటీ

సారాంశం

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

రాజమండ్రి:  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రిలో  రా కదలిరా సభలో  స్టేజీపై నుండి  కింద పడబోయాడు. అయితే  అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును  కాపాడారు.

 రాజమండ్రిలోని కాతేరులో  సోమవారం నాడు నిర్వహించిన రా కదలిరా సభలో  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు.   చంద్రబాబునాయుడుకు బోకేలు ఇచ్చేందుకు  పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున  రావడంతో చంద్రబాబు నాయుడు స్టేజీపై నుండి తూలిపడబోయాడు. వెంటనే అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కాపాడారు.చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు  టీడీపీ నేతలు వచ్చారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని స్టేజీపై నుండి తూలి కిందపడబోయాడు. వెంటనే గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కిందపడిపోకుండా పట్టుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.  స్టేజీపైకి ఒక్కసారిగా వచ్చిన  టీడీపీ శ్రేణులను స్టేజీ కిందకు పంపించారు.

అయితే  రాజానగరం అసెంబ్లీ టిక్కెట్టును జనసేనకు కేటాయించినందుకు  గాను  తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేయడంతో గందరగోళం నెలకొందనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారాన్ని తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఖండించింది. ఉద్దేశ్యపూర్వకంగానే ప్రత్యర్థులు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ  నాయకత్వం ప్రకటించింది.

 

 

 

 

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో  రా కదలిరా పేరుతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  రాష్ట్ర వ్యాప్తంగా  సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించిన సభలో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్