సిఎం జగన్ భద్రతలో లోపాలు: టీడీపి నేత రాకపై అనుమానాలు

By Nagaraju penumalaFirst Published Jun 10, 2019, 4:11 PM IST
Highlights

టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు వేదపండితుడిగా సచివాలయంలో అడుగుపెడితే సీఎం సెక్యూరిటీ ఏం చేస్తోందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు ముఖ్యమంత్రి చాంబర్ కుఎందుకు రావాల్సి వచ్చింది, అందులోనూ వేదపండితుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందో ఇప్పటికైనా సీఎం సెక్యూరిటీ సిబ్బంది విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ డొల్లతనం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ లో అడుగుపెట్టిన రోజే సీఎం సెక్యూరిటీ సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

ఈనెల 8న సీఎం జగన్ మోహన్ రెడ్డి సెక్రటేరియట్ లో అడుగుపెట్టారు. సెక్రటేరియట్ లో అడుగుపెట్టబోతున్న సీఎం జగన్ కు వేదపండితుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు.  అనంతరం ఆశీస్సులు అందజేశారు. 

అయితే వేదపండితులలో టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు, గవర్నమెంట్ ప్లీడర్ ప్రత్యక్షమయ్యారు. జగన్ సెక్రటేయట్ లోకి తొలిసారిగా అడుగుపెడుతున్న తరుణంలో గుంటూరు జిల్లాకు చెందిన నేతలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

జగన్ కు వేదమంత్రాలతో స్వాగతం పలుకుతున్న వేద పండితుల ముసుగులో టీడీపీ లీగన్ సెల్ సభ్యుడు బీటీ సుధీర్ ప్రత్యక్షమవ్వడంపై వారు ఆరా తీశారు. సుధీర్ ఎక్కడా పౌరోహిత్య కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.  

టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు వేదపండితుడిగా సచివాలయంలో అడుగుపెడితే సీఎం సెక్యూరిటీ ఏం చేస్తోందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు ముఖ్యమంత్రి చాంబర్ కుఎందుకు రావాల్సి వచ్చింది, అందులోనూ వేదపండితుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందో ఇప్పటికైనా సీఎం సెక్యూరిటీ సిబ్బంది విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

మెుత్తానికి సీఎం చాంబర్ లో వేదపండితులతో  ప్రత్యక్షమైన బీటీ సుధీర్ ఫోటోలు, అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  

click me!