గోదావరికి పోటెత్తిన వరద:ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

By narsimha lode  |  First Published Aug 12, 2022, 3:44 PM IST


రాజమండ్రి:భారీ వర్షాలతో గోదావరి నదికి వరవ పోటెత్తింది. దీంతో ధవళేశ్వరం వద్ద  గోదావరి నది 15 అడుగులకు చేరింది. గోదావరి  నది  నుండి 14. 70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


రాజమండ్రి:భారీ వర్షాలతో గోదావరి నదికి వరవ పోటెత్తింది. దీంతో ధవళేశ్వరం వద్ద  గోదావరి నది 15 అడుగులకు చేరింది. గోదావరి  నది  నుండి 14. 70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  గోదావరి లంక గ్రామాలకు వరద నీరు ముంచెత్తింది. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను  కోరింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సంస్థ సూచించింది. 

నిన్నటి నుండి గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది.ఎగువన కురిసిన వర్షాలతో ధవశేళ్వరానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం వద్ద నిన్న గోదావరి 14 అడుగులుగా ఉంది. అయితే ఇవాళ్టికి గోదావరి 15 అడుగులకు చేరుకుంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇవ్వడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. 

Latest Videos

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరికి వరద పోటెత్తడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. మళ్లీ మరోసారి వరద  వస్తుండడంతో  ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు  1986 లో వచ్చిన వరదల స్థాయిలో గోదావరికి వరద రావడంతో జూలై మాసంలోనే ముంపు గ్రామాల వాసులు ఇబ్బంది పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి జిల్లాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది.

click me!