ఏపీలో ముగిసిన రెండో రోజు వ్యాక్సినేషన్: ఆసక్తి చూపని వారియర్స్

By Siva KodatiFirst Published Jan 17, 2021, 7:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్ ముగిసింది. తొలి రోజుతో పోలిస్తే... ఇవాళ తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆదివారమని కొందరు, టీకా రియాక్షన్ చూసి తీసుకుంటామని మరికొందరు వారియర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్ ముగిసింది. తొలి రోజుతో పోలిస్తే... ఇవాళ తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆదివారమని కొందరు, టీకా రియాక్షన్ చూసి తీసుకుంటామని మరికొందరు వారియర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదు.

మరోవైపు ఇవాళ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండో రోజు 17,072 మందికి వ్యాక్సినేషన్ అందినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో 2.24 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. 

Also Read:వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత.. !

ఏపీలో తొలి ద‌శ‌లో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిన విష‌యం తెలిసిందే.  

కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ను  వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా వేస్తున్నారు. తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు కల‌గ‌లేదు. నిన్న మొత్తం 19,108 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

click me!