ఏకగ్రీవాలపై ప్రచారం సరికాదు... ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు: ఎస్ఈసీ నిమ్మగడ్డ

By Arun Kumar PFirst Published Feb 2, 2021, 10:03 AM IST
Highlights

లక్షన్ కమీషన్ కు అన్ని పార్టీలు సమానమేనని... అందరినీ సమ దృష్టితో చూడటం తమ పని అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. 

విశాఖపట్నం:  ఎక్కువ మంది ఎన్నికలో పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎలక్షన్ కమీషన్ కు అన్ని పార్టీలు సమానమేనని... అందరినీ సమ దృష్టితో చూడటం తమ పని అన్నారు. అయితే ఏకగ్రీవాల కోసం ప్రచారాలు కరెక్ట్ కాదన్నారు. రేపు(బుధవారం) ఎలక్షన్ కమీషన్ కార్యాలయంలో నిఘా వ్యవస్థను ఆవిష్కరిస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. 

విశాఖ పర్యటనలో భాగంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ... ఎన్నికల ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులనుప్రత్యేకంగా అభినందిస్తున్నానని నిమ్మగడ్డ అన్నారు.

బెదిరింపులు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టు (వీడియో)

''రాష్ట్రంలో 85శాతం పోలింగ్  ఉన్నప్పుడు, విశాఖలో మాత్రం 70 శాతం పోలింగ్ దాటడం లేదు. ఇది కొంత అసంతృప్తిగా ఉంది. అయితే పోలింగ్ శాతం తగ్గడం అధికారుల తప్పుగా అనిపించండం లేదు. ప్రజలు అందరు ఓటు వేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు తప్పకుండా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఓటింగ్ సమయం కూడా పెంచాము. రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమీషన్ చెబుతోంది''  అని నిమ్మగడ్డ తెలిపారు. 

విశాఖ పర్యటన ముగిసిన అనంతరం నిమ్మగడ్డ నేరుగా జగ్గంపేట కు బయలుదేరారు. ఇటీవల సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పదంగా మృతిచెందిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునేందుకు ఎస్ఈసి జగ్గంపేటకు వెళుతున్నట్లు తెలుస్తోంది. 

click me!