సర్పంచ్ గా అచ్చెన్నాయుడి భార్య నామినేషన్..!

By telugu news teamFirst Published Feb 2, 2021, 10:00 AM IST
Highlights

అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. 

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో హైటెన్షన్ చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే.  కాగా..అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మూడు రోజులుగా నిమ్మాడ రగిలిపోతోంది. 

అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చచెప్పాలని చూశారు. అయితే బెదిరించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

అదే సమయంలో అక్కడ వైసీపీ ఇన్చార్జ్  దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలో హల్ చల్ చేశారు. నేరుగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో వైసీపీ కార్యకర్తలు క్రికెట్ బ్యాట్‌లు, రాడ్లు పట్టుకుని రోడ్లపై బీభత్సం సృష్టించారు. అయితే వారిపై కేసులు నమోదు కాలేదు. అచ్చెన్నాయుడుపై మాత్రం కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ నిమ్మాడలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు ముందే అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం వ్యూహాత్మకమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


 

click me!