మొదటి విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారంటూ సీఎస్,డిజిపిలను ఎస్ఈసీ ప్రశంసించారు.
విజయవాడ: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఎస్, డిజిపిలను అభినందించారు. ఇవాళ(గురువారం) చీఫ్ సెక్రటరి ఆదిత్యనాధ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్ లు విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారంటూ అధికారులిద్దరిని ఎస్ఈసీ ప్రశంసించారు.
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి కాబట్టి మిగిలిన విడతలు కూడా ఇలాగే ప్రశాంతంగా ముగిసేలా చూడటంపై వీరు చర్చించారు. ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లపై వీరు చర్చలు జరిగాయి.
read more ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్, డిజిపి భేటీ... కీలక అంశాలపై చర్చ
మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా ఎస్ఈసీ... సీఎస్, డీజీపీలతో చర్చించారు. అనసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య పలు సందర్భాల్లో నవ్వులు విరబూశాయి.