టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై పోలీస్ కేసు: చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Feb 11, 2021, 4:04 PM IST
Highlights

విధులకు అడ్డుపడుతున్నారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేయడాన్నిచంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
 

గుంటూరు: వినుకొండ మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు జీ.వి ఆంజనేయులుపై పోలీసుల అక్రమ కేసు నమోదుచేయడం దుర్మార్గమన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు. విధులకు అడ్డుపడుతున్నారంటూ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేయడాన్నిచంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

''ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. వాస్తవాలు తెలసుకోకుండా టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ హయాంలో ఏపీ పోలీసులు దేశానికి ఆధర్శంగా నిలిస్తే వైసీపీ పాలనలో కొందరు పోలీసులు ఉత్సవ విగ్రహాలుగా మారి వ్యవస్థ పరువు తీస్తున్నారు'' అని అన్నారు.

''వినుకొండ పట్టణ సీఐ చిన్న మల్లయ్య పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి తొత్తుగా వ్యవహరిస్తూ ఏకగ్రీవం చేయకపోతే అక్రమ కేసులు పెడతానని బెదిరించడం హేయనీయం, ఆడవాళ్ళ పట్ల అసభ్య దూషణలకు పాల్పడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సీఐనీ వెంటనే సస్పెండ్ చేయాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

''న్యాయంగా, ప్రజాస్వామ్యబద్దంగా గెలవడం చేతగాక అధికారజులుం చూపించడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం.  ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టే పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుంటున్నారు.  వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజాగ్రహానికి లోనుకాక తప్పదు'' అని చంద్రబాబు హెచ్చరించారు.

click me!