పంచాయతీ ఎన్నికలు: కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jan 30, 2021, 3:38 PM IST
Highlights

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలకు అనుమతించాలని ఆదేశించింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలకు అనుమతించాలని ఆదేశించింది.

కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

పోటీ చేసే వారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది. పోటీ చేసే అభ్యర్ధులు బకాయిలు చెల్లింపునకు వస్తే వెంటనే తీసుకోవాలని ఆదేశించింది. 

కాగా, తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నిన్నటి నుంచి అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు

click me!