కాకినాడలో దారుణం... మైనర్ విద్యార్థినిపై స్కూల్ కరస్పాండెంట్ అత్యాచారం, బాలికకు అబార్షన్

Arun Kumar P   | Asianet News
Published : Jun 05, 2022, 09:27 AM ISTUpdated : Jun 05, 2022, 09:37 AM IST
కాకినాడలో దారుణం... మైనర్ విద్యార్థినిపై స్కూల్ కరస్పాండెంట్ అత్యాచారం, బాలికకు అబార్షన్

సారాంశం

స్కూల్ కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో మైనర్ బాలిక గర్భందాల్చిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. అయితే తాజాగా బాలికకు అబార్షన్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కాకినాడ: తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి విద్యాభ్యాసం అందుతుందని భావించి హాస్టల్లో వుంచి చదివిస్తుంటారు. తమ పిల్లలను బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఒక్కరోజు వుంచాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పేరెంట్స్ హాస్టల్లో సంవత్సరాలకు సంవత్సరాలు వుంచుతుంటారు. ఇదీ ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యంపై వారికున్న నమ్మకం. అలాంటిది ఇటీవల హాస్టల్స్ లో కూడా విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. కాపాడాల్సిన వారే బాలికలను కాటేస్తున్న అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది.  

హాస్టల్లో వుండి చదువుకుంటున్న ఓ బాలికపై కన్నేసిన స్కూల్ కరస్పాండెంట్ నీచానికి పాల్పడ్డాడు. చదువు పేరిట భయపెట్టి బాలికను లోబర్చుకున్న ఈ కీచకుడు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడగా గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... కాకినాడ పట్టణంలోని కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఎయిడెడ్ స్కూల్లో గొడారిగుంట ప్రాంతానికి చెందిన 14ఏళ్ల మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలిక ఇళ్లు స్కూల్ కు దూరంగా వుండటంతో తల్లిదండ్రులు స్కూల్ హస్టల్లో వుంచి చదివిస్తున్నారు. అయితే అభం శుభం తెలియని ఆ బాలికపై స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ కన్నేసాడు.    

బాలికను చదువుల పేరిట భయపెట్టి లోబర్చుకున్న కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం భయటపెట్టొద్దని బెదిరించడం భయంతో బాలిక ఎక్కడా నోరువిప్పలేదు. అయితే తాజాగా బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.   

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటివద్ద వుంటోంది. అయితే మూడురోజుల క్రితం ఆమె తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావంతో బాధపడుతుండంతో తల్లిదండ్రులు జిజిహెచ్ కు హాస్పిటల్ కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చి అబార్షన్ అయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో తనపై స్కూల్ కరస్పాండెంట్ జరిపిన అత్యాచారం గురించి బాలిక బయటపెట్టింది. 

బాలిక తల్లిదండ్రుల తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడిన గర్భవతిని చేసిన కరస్పాండెంట్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇటీవల బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్ళయి భార్యగా మరో చిన్నారి జీవితంతో ఆడుకున్నాడు. 

నీచపు ఆలోచనలతో రగిలిపోయిన కోటయ్య అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసాడు. తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక అమ్మమ్మ వద్దే వుంటోంది. దీంతో బాలికను ఏంచేసినా గట్టిగా అడిగేవారెవరూ లేరని భావించాడో ఏమో వాలంటీర్ కోటయ్య దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా అతడి చేష్టలను భరించలేక తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వాలంటీర్ కేసు నమోదయ్యింది. 

ఇదిలావుంటే పల్నాడు జిల్లాలోనూ ఇలాగే మనవరాలి వయసున్న ఏడేళ్ల చిన్నారితో అత్యంత నీచంగా ప్రవర్తించాడో వృద్దుడు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం రాజీవ్ గాంధీ కాలనీలో ఏడేళ్ళ చిన్నారి ఇంటిపక్కనే వుండే ఓ వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్