నెల్లూరులో స్కూల్ వ్యాన్ బోల్తా, 15 మంది చిన్నారులకు గాయాలు

Published : Aug 30, 2019, 09:40 AM IST
నెల్లూరులో స్కూల్ వ్యాన్ బోల్తా, 15 మంది చిన్నారులకు గాయాలు

సారాంశం

నెల్లూరు జిల్లాలో మరో స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వెంకటగిరి శ్రీచైతన్య పాఠశాలకు విద్యార్ధులతో వెళ్తున్న బస్సు డక్కిలి మండలం కుప్పాయపాలెం వంతెనపై బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. 

వేములవాడ పాఠశాల వ్యాన్ బోల్తా పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన మరచిపోకముందే నెల్లూరు జిల్లాలో మరో స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వెంకటగిరి శ్రీచైతన్య పాఠశాలకు విద్యార్ధులతో వెళ్తున్న బస్సు డక్కిలి మండలం కుప్పాయపాలెం వంతెనపై బోల్తాపడింది.

ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధులను డక్కిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం

PREV
click me!

Recommended Stories

Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu
ఏపీలో 3డీ కాంక్రీట్ ఇళ్లు.. అస‌లేంటీ టెక్నాల‌జీ, 10 రోజుల్లో ఇంటిని ఎలా క‌ట్టేస్తారు.?