తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Published : Aug 07, 2020, 05:09 PM ISTUpdated : Aug 07, 2020, 06:13 PM IST
తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

సారాంశం

: తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 

తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప జిల్లా జైలు నుండి గురువారం నాడు బెయిల్ పై విడుదలై అనంతపురం వస్తున్న సమయంలో  సీఐ దేవేంద్రకుమార్ తో వాగ్వాదం చోటు చేసుకొంది.

తాడిపత్రికి సమీపంలోని బొందలదిన్నె వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి సీఐ దేవేంద్రకుమార్ తో గొడవకు దిగారు. సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.

సీఐ దేవేంద్రకుమార్ ఫిర్యాదుతో తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో పోలీసులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. మరో వైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కడప  పోలీసులు కూడ గురువారం నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టారు. వీరితో పాటు మరో 31 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.

also read:వెంటాడుతున్న కేసులు: 2 గంటలకు పైగా పోలీస్ స్టేషన్‌లోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

బెయిల్ పై విడుదలైన సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున అనంతపురం నుండి కడపకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసులు పెట్టారు.

కండిషన్ బెయిల్ పై విడుదలైన సందర్భంగా   ఇవాళ అనంతపురం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు ఇంకా అనంతపురం వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లోనే ఉన్నారు.

 


 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?