సత్యవేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

Published : Jun 04, 2024, 07:06 AM IST
సత్యవేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

సారాంశం

 సత్యవేడు నియోజకవర్గం తొలి నుంచి టీడీపీకి కంచుకోట. 1962 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, ఒకసారి ఇండిపెండెంట్, మరోసారి వైసీపీ విజయం సాధించాయి.  

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడులో నియోజకవర్గం ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో వుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల కల్చర్ సత్యవేడులో విలసిల్లుతోంది. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్. ఈ సెగ్మెంట్ పరిధిలో నారాయణవనం, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, కేవీబీ పురం, పిచ్చాటూర్, సత్యవేడు, నాగలాపురం మండలాలున్నాయి. సత్యవేడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,771 మంది.

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా నగరి నియోజకవర్గం నుంచి నారాయణవనం మండలం, పిచ్చాటూరు మండలం, కేవీబీ పురం సత్యవేడు పరిధిలోకి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీ దాస్ సత్యవేడులో మూడు సార్లు విజయం సాధించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ శివప్రసాద్.. చిత్తూరు ఎంపీగానూ పనిచేశారు. 

సత్యవేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి కంచుకోట :

సత్యవేడు నియోజకవర్గం తొలి నుంచి టీడీపీకి కంచుకోట. 1962 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, ఒకసారి ఇండిపెండెంట్, తాజాగా వైసీపీ విజయం సాధించాయి. ఇక్కడ తండ్రి కొడుకులైన తలారి మనోహర్, తలారి ఆదిత్యలు టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా పనిచేయడం విశేషం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కోనేటి ఆదిమూలం రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించి టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టారు. ఆ ఎన్నికల్లో ఆదిమూలానికి 1,03,941 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి జెద్దా రాజశేఖర్‌కు 59,197 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 44,744 ఓట్ల మెజారిటీతో ఆదిమూలం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు.

సత్యవేడు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. ఆదిమూలం రాకపై తమ్ముళ్ల ఆగ్రహం :

2024 ఎన్నికల విషయానికి వస్తే. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టికెట్ నిరాకరించి ఆయనను తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ. సత్యవేడు అభ్యర్ధిగా నూకతోటి రాజేష్‌ను ప్రకటించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆదిమూలం ససేమిరా అనడమే కాకుండా రోజుల వ్యవధిలోనే టీడీపీలో చేరారు. ఆ వెంటనే చంద్రబాబు.. కోనేటి ఆదిమూలంను సత్యేవేడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu