
Chirala assembly elections result 2024: చీరాల రాజకీయాలు :
చీరాల నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రిని అందించింది. ఇక్కడి నుండి మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రెండుసార్లు (1989,2004) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ (2009,2014), చివరగా 2019 ఎన్నికల్లో కరణం బలరాం ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిని వీడి అధికార వైసిపిలో చేరారు చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం.
చీరాల అసెంబ్లీ పరిధిలోని మండలాలు :
1. వేలపాలెం
2. చీరాల
చీరాల నియోజకవర్గంలోని ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం)
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,90,830
పురుషులు - 93,573
మహిళలు - 97,245
చీరాల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపి అధిష్టానం కరణం వెంకటేష్ ను బరిలో దింపింది.
టిడిపి అభ్యర్థి :
టీడీపీ,జనసేనా, బీజేపీ కూటమి నుంచి మద్దూలూరి మాలకొండయ్య యాదవ్ బరిలో ఉన్నారు.
చీరాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
చీరాల అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు 1,57,511
టిడిపి - కరణం బలరాం - 83,901 (53 శాతం) - 17,419 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - ఆమంచి కృష్ణమోహన్ - 66,482 (42 శాతం) - ఓటమి
(ప్రస్తుతం కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ వైసిపిలోనే వున్నారు.)
చీరాల అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు 1,54,700
నవోదయం పార్టీ - ఆమంచి కృష్ణమోహన్ - 57,544 (37 శాతం) - 10,335 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - పోతుల సునీత - 47,209 (30 శాతం) - ఓటమి
వైసిపి - బాలాజీ యాడం - 40, 955 (25 శాతం) - ఓటమి
వైసిపి - ఆమంచి కృష్ణమోహన్ - 66,482 (42 శాతం) - ఓటమి