నగ్నంగా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టు: లోన్ యాప్ వేధింపులకు రాజమండ్రిలో సతీష్ సూసైడ్

By narsimha lode  |  First Published Jun 28, 2022, 12:58 PM IST

లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలయ్యారు. ఉమ్మడి తూర్పుగోదవరి జిల్లాలోని కడియానికి చెందిన సతీష్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక భీమవరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 



రాజమండ్రి:Loan APP యాప్ వేధింపులకు మరొకరి బలయ్యారు. లోన్ యాప్ నిర్వాహకులు Morphing చేసి ఫోటోలు షేర్ చేయడంతో పాటు పలు రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తట్టుకోలేక Satish అనే యువకుడు ఉమ్మడి East Godavari  జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా Police  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని Rajahmundryకి చెందిన సతీష్ లోన్ యాప్ వేధింపులు భరించలేక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో రైలు కింద పడి Suicide చేసుకున్నాడు. సతీష్ మరణించిన తర్వాత కూడా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Latest Videos

తూర్పు గోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన సతీష్ ఫోటోను nude మార్పింగ్ చేసి Whats APP  లో అతని స్నేహితులు బంధువులకు షేర్ చేశారు. అంతేకాదు సతీష్ పై తప్పుడు ప్రచారం చేశారు. అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని లోన్ యాప్ నిర్వాహకులు సతీష్ స్నేహితులు, బంధువులకు షేర్ చేశాడు. ఈ వేధింపులు తీవ్రం కావడంతో సతీష్ భీమవరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

సతీష్ ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయం పోలీసులు చెప్పేవరకు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సతీష్ స్నేహితులు, సోదరుల ఫోన్లకు వచ్చిన ఫోన్ల ఆధారంగా లోన్ యాప్ వేధింపుల కారణంగానే సతీష్ మరణించినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులకు ఈ నెల 9న హైద్రాబాద్ లో ఖాజా అనే వ్యక్తి బలయ్యాడు. హైద్రాబాద్ నగరంలోని జవహర్ నగర్ సాయి గణేష్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మహమ్మద్ ఖాజా అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

also read:లోన్‌యాప్స్ కేసులో కొత్త కోణం : రిక్వెస్ట్ పంపకుండానే ఖాతాల్లోకి డబ్బు, ఏడు రోజుల్లో కట్టాలంటూ బెదిరింపులు

లోన్ డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకుల నుండి ఇటీవల కాాలంలో వేధింపులు ఎక్కువైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యకి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్  నిర్వాహకులు అప్పులు చెల్లించాలని కోరుతూ పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి. మంచిర్యాల జిల్లాలో వేధింపులకు పాల్పడడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ఏడాది మే 16న చోటు చేసుకుంది.

 కళ్యాణి అనే మహిళ రూ.30 వేలు లోన్ తీసుకుంది. లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో కళ్యాణిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపారు లోన్ యాప్ నిర్వాహకులు. ఈ  అవమానాన్ని భరించలేక మనస్తాపంతో కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది. 

హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రూ. 12 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే లోన్ సమయంలో రిఫరెన్స్‌గా స్నేహితుల ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. తీసుకున్న రుణానికి సంబంధించి.. ఈఎంఐ ద్వారా 4 నెలలు చెల్లింపులు చేశాడు. మిగిలిన నగదు చెల్లించకపోవడంతో రాజ్‌కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 19న జరిగింది.

ఈ ఏడాది జనవరి 30న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన సింగటి రమేష్  హైద్రాబాద్ లోని ఉప్పల్ లో ఎనిమిది నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. తనతో పాటు ఇతర మిత్రులు కూడా అదే రూమ్ లో ఉంటున్నారు. రమేష్ ఆన్ లైన్ లో గణితం బోధిస్తున్నాడు. అవసరం కోసం రమేష్ ఆన్ లైన్ లోన్ యాప్  ద్వారా రూ.5 వేలు అప్పుగా తీసుకొన్నాడు.  అయితే  సకాలంలో రమేష్ ఈ అప్పును చెల్లించలేదు. దీంతో రమేష్ బంధు మిత్రులకు యాప్ నిర్వాహకులు ఈ విషయమై మేసేజ్ పెట్టారు. ఈ అప్పును చెల్లించాలని రమేష్ ను పదే పదే వేధింపులకు గురి చేశారు. ఈ వేధింపులు భరించలేక  రమేష్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో మిత్రులు ఎవరూ లేని సమయంలో రమేష్ ఫ్యాన్ కు ఉరేసుకొన్నాడు.

click me!