రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం.. భారీగా తరలివచ్చిన జనం.. పోలీసుల ఆంక్షలను లెక్కచేయని నిర్వాహకులు..

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 12:43 PM IST
Highlights

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ జల్లికట్టు పోటీల నిర్వహించేందుకు అక్కడివారు వెనక్కి తగ్గలేదు.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ జల్లికట్టు పోటీల నిర్వహించేందుకు అక్కడివారు వెనక్కి తగ్గలేదు. ఈ పోటీలను వీక్షించేందుకు వేల సంఖ్యలో జనం రంగంపేటకు తరలివచ్చారు. కనుమ పండగ రోజున పశువుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ.. తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. తాము నిర్వహించేంది జల్లికట్టు కాదని.. పశువుల పండగ అని వారు చెబుతున్నారు. 

పోటీల్లో భాగంగా పశువుల కొమ్ములకు పలకలు కట్టి ఇరుకైన దారిలో వదులుతారు. పోటీల్లో పాల్గొనే యువత పశువుల కొమ్ములకు కట్టిన పలకలను సొంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే పశువులు దాడి చేయడంతో యువత గాయాల బారిన పడుతుంటారు. 

జల్లికట్టు సహా ఆ రకమైన క్రీడల నిర్వహణకు ఎటువంటి పోలీసుల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించే జల్లికట్టుపై పూర్తిగా నిషేధం ఉందని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు. డబ్బుల కోసం జల్లికట్టు, పేకాట, గుండాట వంటివి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇక, జల్లికట్టు అనే పేరు చెప్పగానే అందరికి ముందుగా తమిళనాడు గుర్తుకు వస్తుంది. అయితే తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు తరహాలో పశువుల పండుగ జరుగుతుంది. తమిళనాడులో కనుమ రోజు జల్లికట్టు జరుకుంటే.. ఇక్కడ మాత్రం సంక్రాంతి ముందే నుంచే ప్రారంభం అవుతుంది. అయితే తాము నిర్వహించేది జల్లికట్టు కాదని పశువుల పండగ  స్థానికులు చెబుతారు. చాలా ఏళ్ల నుంచి తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. 

click me!