వైఎస్ వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ..

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 11:09 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు తీర్పు వెలువరించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా తెలిపింది. చార్జిషీట్‌ సమర్పించిన తర్వాత మెరిట్‌పై డిఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయడంలో ఎలాంటి అడ్డంకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. బెయిల్ రద్దు మెరిట్‌లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎర్ర గంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఇక, సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్, ఎర్ర గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు జనవరి 5న తీర్పును రిజర్వ్ చేసింది.

click me!