మీరు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను: నాగబాబుకు మంత్రి అంబటి కౌంటర్

Published : Jan 16, 2023, 12:18 PM IST
మీరు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే.. కానీ ముఖానికి రంగు వేయను: నాగబాబుకు మంత్రి అంబటి కౌంటర్

సారాంశం

జనసేన నేత, సినీ నటుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. 

జనసేన నేత, సినీ నటుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భోగి వేడుకల్లో అంబటి రాంబాబు డ్యాన్స్ వీడియోపై స్పందించిన నాగబాబు.. డ్యాన్స్ బాగా చేశారని, పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఇంకా బాగుండేదని సెటైర్లు వేశారు. అయితే ఇందుకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు, ఆయన తమ్ముడు అన్నట్టు  తాను సంబరాల రాంబాబునే అని అన్నారు. కానీ ముఖానికి రంగు వేయనని.. ప్యాకేజి కోసం డాన్స్ చేయనని అన్నారు.  ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేసిన అంబటి రాంబాబు.. నాగబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అకౌంట్స్‌ను ట్యాగ్ చేశారు. 

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.

 

Also Read: ఆ పని పూర్తి చేసి డ్యాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.. మంత్రి అంబటిపై నాగబాబు సెటైర్లు..

అయితే దీనిపై స్పందించిన నాగబాబు.. ‘‘సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు... పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !’’ అని ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్